మన సమాజంలో పేరుకుపోయిన అవినీతి,అక్రమాల అంతం చూడాలని పుట్టింది ఈ దళం.మేము ఏ రాజకీయ పార్టీకి మద్దతు పలకము.మాది ఏ కులమూ కాదు ఏ మతమూ కాదు,అంతగా చెప్పాలంటే భారతీయ మతం మాది. మనిషిగా పుట్టినందుకు ఈ సమాజానికి,ఈ దేశంలో పుట్టినందుకు ఈ దేశానికి ఏదైన మంచి చేయాలనే తలంపుతో ఈ దళ్ స్థాపనకు పూనుకొవడం జరిగింది.ఎంతో మందికి మాలాంటి భావాలే ఉంటాయి ,కాని సరైన వేదిక లేక వ్యక్తీకరించలేకపోతున్నారు.అటువంటి వాళ్ళందరికీ మన దళం స్వాగతం పలుకుతుంది .రండి దళం లో చేరండి ,నవసమాజ స్థాపనకు సహకరించండి.