ముంబాయ్ లో జరిగిన 26/11 పేలుళ్ళలో 195 మంది చావుకు కారణమైన పాకిస్తాన్ ఉగ్రవాద గ్రూప్ కి చెందిన 11 మంది మన పోలీసుల దాడి లో ప్రాణాలు కొల్పోగా ఒక్క అజ్మల్ కసబ్ మాత్రం ప్రాణాలతో దొరికాడు ఇది మనం చేసుకున్న దురదృష్టం వాడు కూడ అప్పుడే ఒక్క బుల్లెట్ తో పొయెటోడు అనవసరంగా వాడు బతికి మనకు 20 కోట్లు బొక్క పెట్టాడు .వాడు అడిగిన బిర్యానీలు చికెన్లు ,మటన్లు సప్లై చెసే ఘనత వహించిన ప్రభుత్వం మనది.అదే దాడిలొ ప్రాణాలు కోల్పోయిన పొలిసులకు సరైన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ ని ఇవ్వని ప్రభుత్వం అంత మందిని చంపిన ఫాల్తుగాని కొసం 20 కోట్లు ఖర్చు పెట్టింది.మన రాష్ట్రపతి,ప్రధాని కి లేని భద్రత వానికుంది .10 మందిని చంపేసినా పది సంవత్సరాలు శిక్ష వేయని కోర్టులు మనవి.అలాంటిది వీనికి ఉరిశిక్ష అమలౌతుంది అనుకోవడం మన మూర్ఖత్వం .ఒకవేళ మన ఖర్మ బాగుండి ఏదైన ప్రమాదంలొ వాడు పోతే మన నాయకులు సంతాపం తెలియచేసినా మనం అశ్చర్యపోవక్కర్లెదు.
వీడే ఆ అదృష్టవంతుడు
